Team India: పాక్ జట్టుకు అంత సీన్ లేదన్న భారత జట్టు మాజీ పేసర్

Indias C Team Can Beat Pakistans Main XI Says Team India Ex Player Sreesanth
  • మన సీ టీమ్ కూడా ఆ జట్టును ఓడిస్తుందని శ్రీశాంత్ ధీమా
  • స్పోర్ట్స్ కీడా కార్యక్రమంలో మాట్లాడిన శ్రీశాంత్
  • ఇండియాతో ఫైనల్లో తలపడతామన్న పాక్ జట్టు డైరెక్టర్
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పై భారత మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ జట్టుకు భారత్ ను ఓడించేంత సీన్ లేదని తేల్చేశారు. ఇప్పుడున్న పాక్ జట్టును ఇండియా సీ టీమ్ కూడా ఓడిస్తుందని, ఇదే పరిస్థితి కొనసాగితే ఈ టోర్నమెంట్ లో ఫైనల్ దాకా చేరుకోవడం వారికి కలేనని స్పష్టం చేశారు. ఈమేరకు స్పోర్ట్స్ కీడా కార్యక్రమంలో మాట్లాడుతూ శ్రీశాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. టోర్నమెంట్ లో భాగంగా ఇటీవల జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టును రోహిత్ సేన చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.

ఈ మ్యాచ్ తర్వాత బాబర్ అజాం కెప్టెన్సీలోని పాక్ జట్టు సామర్థ్యంపైన ఆ దేశ అభిమానులకూ సందేహాలు రేకెత్తాయి. పలువురు మాజీలు కూడా పాక్ జట్టు ఆట తీరుపై పెదవి విరుస్తున్నారు. అయితే, ఆ జట్టు డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ మాత్రం తమ ఆటగాళ్లపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాతో తమ జట్టు ఫైనల్ లో తలపడుతుందని ధీమాగా చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలపై శ్రీశాంత్ స్పందిస్తూ.. పాక్ జట్టు ఆటతీరు నాసిరకంగా ఉందని, భారత్ లోని సీ టీమ్ కూడా ఆ జట్టును ఓడిస్తుందని అన్నారు. ఇలాంటి టీమ్ తో భారత జట్టుపై ఆడి గెలవాలని అనుకోవడం అత్యాశేనని చెప్పారు. ఇలాగే ఆడితే ఫైనల్ దాకా చేరడం కూడా కష్టమేనని శ్రీశాంత్ విమర్శించారు.
Team India
Sreesanth
Pakistan
Cricket
world cup

More Telugu News