Ram Charan: రామ్ చరణ్ ఖాతాలో మరో కొత్త యాడ్... వీడియో ఇదిగో!

Ram Charan features in Manyavar ad film
  • బ్రాండింగ్ లోనూ దూసుకుపోతున్న గ్లోబల్ స్టార్
  • మాన్యవర్ దుస్తుల సంస్థ యాడ్ లో రామ్ చరణ్
  • నేషనల్ లెవల్లో ప్రసారం కానున్న యాడ్

టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల్లోనే కాదు, బ్రాండింగ్ లోనూ దూసుకుపోతున్నారు. రామ్ చరణ్ ఇప్పటికే పలు కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్నారు. తాజాగా ఆయన ఖాతాలో మరో యాడ్ చేరింది. రామ్ చరణ్ ప్రముఖ దుస్తుల సంస్థ మాన్యవర్ వాణిజ్య ప్రకటనలో నటించారు. ఈ యాడ్ హిందీలో చిత్రీకరించారు. అంటే, ఇది జాతీయ స్థాయిలో ప్రసారం కానున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే రామ్ చరణ్ మీషో యాప్ కోసం చేసిన యాడ్ ఫిలింకు కూడా విశేష స్పందన వచ్చింది. 

ఇక మాన్యవర్ యాడ్ విషయానికొస్తే తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని మాన్యవార్ దుస్తులతో చాటిచెప్పే కాన్సెప్టుతో తెరకెక్కించినట్టు అర్థమవుతోంది. 'మనల్ని ప్రేమించేవారిని మనకన్నా అధికంగా ప్రేమించాలన్నది మా నాన్న నుంచి అలవర్చుకున్నాను... జీవితంలో నిలదొక్కుకోవడం నాన్న నుంచి నేర్చుకున్నాను' అంటూ రామ్ చరణ్ ఈ యాడ్ లో పేర్కొనడం చూడొచ్చు.

  • Loading...

More Telugu News