Vijayasai Reddy: చంద్రబాబేమీ దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త కాదు: విజయసాయిరెడ్డి

VijayaSaiReddy counter to tdp leaders
  • టీడీపీ నేతలు మైండ్ బ్లాక్ అయి స్టేట్‌మెంట్ ఇస్తున్నారన్న వైసీపీ ఎంపీ
  • చంద్రబాబేమో ప్రజలే తన ఆస్తి అనుకొని ఖజనాకు కన్నం వేశారని చురకలు
  • ఆధారాల సహా దొరికి జైలుపాలైన నిందితుడు చంద్రబాబు అని ఎద్దేవా  

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమహేంద్రవరం కేంద్రకారాగారంలో ఉన్న చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ వరుసగా కార్యక్రమాలు చేపడుతోంది. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు ప్రజల ఆస్తి అని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సోషల్ మీడియా అనుసంధాన ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.

'చంద్రబాబు ప్రజల ఆస్తి. ఆయన కోసం పోరాడాల్సిన బాధ్యత జనానిదే' అంటూ మైండ్ బ్లాక్ అయిన టీడీపీ నేతలు స్టేట్ మెంట్లు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఏమో ప్రజలే తన ఆస్తి అనుకుని ఖజానాకు కన్నం వేశారని, దొరికినంత దోచుకున్నారని వ్యాఖ్యానించారు. ఆయనేమీ (చంద్రబాబు) దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త కాని, గొప్ప క్రీడాకారుడూ కాదన్నారు. స్కిల్ కేసులో ఆధారాలతో సహా దొరికి జైలుపాలైన నిందితుడు... వెన్నుపోటుదారుడని విమర్శించారు.

  • Loading...

More Telugu News