ఏపీలో బీసీల కుల గణన... ఎప్పట్నించి అంటే...!
- నవంబరు 15 నుంచి రాష్ట్రంలో బీసీల కుల గణన ప్రక్రియ
- ఉన్నతాధికారులతో కమిటీ వేశామన్న మంత్రి చెల్లుబోయిన
- సీఎం జగన్ సమగ్ర కుల గణనకు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడి
ఈ కుల గణన కార్యక్రమంలో వార్డు/గ్రామ సచివాలయ ఉద్యోగులతో పాటు వాలంటీర్ల సేవలు కూడా వినియోగించుకోనున్నట్టు వివరించారు. 139 వర్గాలుగా ఉన్న బీసీ కులాలకు ఉపయుక్తంగా ఉండేలా ఈ గణన కార్యక్రమం ఉంటుందని మంత్రి తెలిపారు. జనగణన జరిగే క్రమంలో కులగణన కూడా జరిపించేలా కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ నుంచి తీర్మానం పంపించామని వెల్లడించారు.
విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కర్నూలు వంటి ప్రధాన పట్టణాల్లో బీసీ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి వారి సలహాలు, సూచనలు తీసుకుంటామని మంత్రి చెల్లుబోయిన చెప్పారు.