mahender reddy: కాంగ్రెస్ కావాలనే దుష్ప్రచారం చేస్తోంది.. కొడంగల్‌లోనూ గెలుస్తాం: మంత్రి మహేందర్ రెడ్డి

Mahender Reddy on party change
  • తాను పార్టీ మారుతున్నాననే ప్రచారాన్ని సహించేది లేదన్న మహేందర్ రెడ్డి 
  • తాను పార్టీ మారేది లేదని స్పష్టీకరణ
  • తనపై బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత ఉందన్న మహేందర్ రెడ్డి
తాను పార్టీ మారుతున్నానంటూ కాంగ్రెస్ పార్టీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని, ఇలాంటి అసత్య ప్రచారాన్ని సహించేది లేదని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. పట్నం మహేందర్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో ఆయన ఈ అంశంపై తాండూరులో వివరణ ఇచ్చారు. తాను పార్టీ మారేది లేదన్నారు. ఓ మంత్రిగా ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత తనపై ఉందన్నారు.

పైలట్ రోహిత్ రెడ్డి గెలుపు కోసం పార్టీ శ్రేణులంతా కృషి చేస్తున్నారన్నారు. తాండూరుతో పాటు కొడంగల్‌లోను పట్నం నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. తమ ప్రాంతంలో కొంతమంది నాయకులు పార్టీ మారినంత మాత్రాన నష్టమేమీ లేదన్నారు. తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేవారు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు.
mahender reddy
Congress
kodangal
BRS

More Telugu News