X: ట్విట్టర్ (ఎక్స్) లో లైక్ కొట్టాలన్నా డబ్బు చెల్లించాల్సిందేనట!

  • ఏడాదికి ఒక డాలర్ చెల్లిస్తేనే లైక్, రీట్వీట్ కు అవకాశం
  • ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం కొత్త ప్రతిపాదన
  • వెబ్ వెర్షన్ లో పరీక్షిస్తున్నట్లు వెల్లడించిన ‘ఎక్స్’
X To Charge 1 Dollor Subscription Fee For Like Reply And Repost

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’ మరో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ట్వీట్లకు లైక్ కొట్టాలన్నా, ఇతరులు చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేయాలన్నా, రిప్లై ఇవ్వాలన్నా డబ్బులు చెల్లించాల్సిందేనని అంటోంది. ఏడాదికి ఒక డాలర్ చెల్లించి సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారికే ఈ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ విధానాన్ని వెబ్ వెర్షన్ లో పరీక్షిస్తున్నామని, త్వరలో దీనిని అమలులోకి తీసుకొస్తామని చెప్పింది. ఈ కొత్త సబ్ స్క్రిప్షన్ మోడల్ ముఖ్య ఉద్దేశం స్పామర్లను, రోబోలను అడ్డుకోవడానికేనని తేల్చి చెప్పింది. వార్షిక ఫీజు విషయానికి వస్తే.. అమెరికన్లకు ఏటా ఒక డాలర్, మిగిలిన దేశాలలో ఎక్చేంజ్ రేటును బట్టి ధరలు మారుతాయని వివరించింది.

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత పలు మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగులను తొలగించడం మొదలుకొని బ్లూటిక్ కు ఫీజు వసూలు చేయడం దాకా పలు వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై విమర్శలు ఎదురవడంతో పలు నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారు. తాజాగా ట్వీట్లకు లైక్ కొట్టాలన్నా, రీట్వీట్ చేయాలన్నా ఫీజు చెల్లించాల్సిందేనని స్పష్టం చేయడంతో నెటిజన్ల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

More Telugu News