Chandrababu: చంద్రబాబు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసిన జైలు అధికారులు

Jail officials releases chandrababu health bulletin
  • చంద్రబాబును స్నేహ బ్యారక్‌లో ఉంచినట్లు తెలిపిన జైలు అధికారులు
  • ప్రతిరోజు మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడి
  • కోర్టు ఆదేశాల మేరకు ఇంటి భోజనానికి అనుమతి
  • చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపిన అధికారులు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు హెల్త్ బులెటిన్‌ను రాజమహేంద్రవరం కేంద్ర కారాగార అధికారులు విడుదల చేశారు. 38 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబును జైల్లోని స్నేహ బ్యారక్‌లో ఉంచినట్లు తెలిపారు. ఆయనకు ప్రతిరోజు మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. బీపీ, శరీర ఉష్ణోగ్రత, ఊపిరితిత్తుల పరిస్థితి, నాడి సాధారణంగానే ఉన్నట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఇంటి భోజనానికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు. కాగా, కోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు జైల్లో టవర్ ఏసీ ఏర్పాటు చేయడం తెలిసిందే.
Chandrababu
Telugudesam
Andhra Pradesh

More Telugu News