Vijayasai Reddy: టీడీపీ సంకెళ్ల ఫొటోషూట్ ఐడియా లోకేశ్‌దేనట... పరువు తీసుకున్నారు: విజయసాయిరెడ్డి

VijayaSaiReddy satires on Nara lokesh and TDP
  • తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి టీడీపీ పరువు తీసుకుందన్న విజయసాయిరెడ్డి
  • హక్కుల కోసం పోరాడే పేదలను అణచివేయాలని చూస్తే పౌర సంఘాలు నిరసన తెలపడం చూశామన్న విజయసాయిరెడ్డి
  • కానీ చంద్రబాబును సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేస్తే తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేశారని విమర్శ

చంద్రబాబు అనే అవినీతిపరుడ్ని అరెస్ట్ చేస్తే తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి టీడీపీ పరువు తీసుకుందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కుల కోసం పోరాడే పేదలను అణచివేయాలని చూసినప్పుడు స్వేచ్ఛకు బేడీలు వేస్తారా? అని పౌర సంఘాలు నిరసన తెలపడం చూశామని, కానీ చంద్రబాబు అనే అవినీతి తిమింగలాన్ని సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేస్తే చేతులకు తాళ్లు, గొలుసులతో ప్రదర్శన చేసి పచ్చ పార్టీ పరువు తీసుకుందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఈ ఫొటో షూట్ ఐడియా నారా లోకేశ్‌దేనని టీడీపీ వర్గాల బోగట్టా అని చురక అంటించారు.

అంతకుముందు కూడా ఓ ట్వీట్ చేశారు. వీళ్లు చేసే సంకెళ్ల ఫోటోషూట్, లైట్లు ఆర్పేసి కొవ్వొత్తులు వెలిగించే సెలెబ్రేషన్స్ ప్రజలకు చంద్రబాబు చేసిన కుంభకోణాల గురించి అవగాహన పెంచుతున్నాయని ఎద్దేవా చేశారు. నిరసన పేరుతో వీళ్లు డ్రామాలు చేసిన ప్రతిసారి ఒక వర్గం వాళ్లే తల్లడిల్లిపోతున్నారని, చంద్రబాబు జైలు పుణ్యాన వీళ్ల అసలు రూపాలు బయటపడ్డాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News