Telangana: ప్రవళిక ఆత్మహత్య కేసు... స్పందించిన తల్లి, సోదరుడు

Pravalika mother and brother responded on her suicide
  • తన కూతురు చావుకు కారణమైన వాడికి ఉరిశిక్ష వేయాలన్న ప్రవళిక తల్లి
  • శివరామ్ వేధింపులు భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందన్న తల్లి
  • తన చెల్లి హాస్టల్‌లో చదువుతున్న సమయంలో వేధించాడన్న ప్రవళిక సోదరుడు
త‌న కూతురు చావుకు కార‌ణ‌మైన వాడికి ఉరిశిక్ష వేయాల‌ని ప్ర‌వ‌ళిక త‌ల్లి విజ‌య డిమాండ్ చేసింది. తమ కూతురును రాజకీయాల్లోకి లాగవద్దని ఆమె కోరారు. రెండేళ్లుగా తన కూతురుని హైదరాబాద్‌లో చదివించుకుంటున్నానని, తన కొడుకూ అక్కడే చదువుతున్నట్లు తెలిపారు. తన కూతురును ఓ యువకుడు వేధించాడని, వాడి వేధింపులు భరించలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని కన్నీరుమున్నీరయ్యారు. తన బిడ్డ చావుకు కారణమైన వ్యక్తిని వెంటనే శిక్షించాలన్నారు. వాడిని మళ్లీ బయట తిరగకుండా చేయాలన్నారు.

తన చెల్లి హాస్టల్‌లో చదువుకోవడానికి వెళ్లినప్పుడు వేధింపులకు గురి చేశారని, ప్రెండ్స్ ఫోన్‌లతో పాటు ఇతర నెంబర్ల నుంచి కాల్ చేసి ఇబ్బందులకు గురి చేసినట్లు ప్రవళిక సోదరుడు చెప్పారు. తన చెల్లి చావుకు కారణమైన శివరామ్‌ను కఠినంగా శిక్షించాలన్నారు. తమ కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగవద్దని కోరారు.
Telangana
Crime News

More Telugu News