Akula Lalitha: బీఆర్‌ఎస్‌ను వీడిన మరో కీలక నేత

  • సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖ పంపించిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత
  • పార్టీలో ఎమ్మెల్యేల పాలన సాగుతోందని విమర్శ 
  • ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీల పరిస్థితి వర్ణనాతీతంగా ఉందని వ్యాఖ్య 
  • ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందంటూ వార్తలు
Akula lalitha resigns from BRS

నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకారాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖ రాశారు. 

బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రభుత్వంగా పరిపాలన సాగుతోందని ఆకుల లలిత ఈ సందర్భంగా విమర్శించారు. స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలనగా మారిందని దుయ్యబట్టారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల బాధ వర్ణనాతీతమని విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాలు తనను బాధించడంతో బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఆకుల లలిత కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

More Telugu News