Palestine: ఈ వారంలోనే జిన్ పింగ్, పుతిన్ కీలక భేటీ

  • 17, 18 తేదీల్లో బీజింగ్ లో బెల్డ్ అండ్ రోడ్ ఫోరమ్ భేటీ
  • దీనికి హాజరు కానున్న రష్యా అధ్యక్షుడు
  • ఈ సందర్భంగా కీలక అంశాలపై చర్చ
Back Back Palestine in focus Putin to meet Xi Jinping in China amid Hamas Israel conflict

ఒకవైపు గాజాపై ఇజ్రాయెల్ భీకర యుద్ధానికి సిద్ధం కాగా, మరోవైపు ఈ వారంలోనే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ కానున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతంపై ఈ భేటీలో దృష్టి సారించనున్నారు. బీజింగ్ లో ఈ నెల 17-18వ తేదీల్లో బెల్ట్ అండ్ రోడ్ ఫోరమ్ జరగనుంది. దీనికి రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కానున్నారు. 130 దేశాల ప్రతినిధులు సైతం దీనికి హాజరు కానున్నారు. కానీ భారత్ ఇందులో పాల్గొనకూడదని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

2022 ఫిబ్రవరిలో చైనా-రష్యా హద్దుల్లేని ద్వైపాక్షిక బంధాన్ని ప్రకటించడం తెలిసిందే. ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగడానికి కేవలం కొన్ని రోజుల ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనాను సందర్శించారు. ఇప్పుడు మరో విడత బీజింగ్ కు రానుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా ఇజ్రాయెల్-పాలస్తీనా యుద్ధం విషయంలో ప్రపంచం రెండు ధ్రువాలుగా మారిపోయిన నేపథ్యంలో.. పాలస్తీనాకు మద్దతునిస్తున్న రష్యా, చైనా దేశాల అధినేతల భేటీకి ప్రాధాన్యం నెలకొంది. ఇస్రాయెల్ దాడులను ఇప్పటికే చైనా ఖండించడం గమనార్హం. పాలస్తీనా ప్రత్యేక దేశానికి మద్దతుగా పుతిన్ మాట్లాడారు.

More Telugu News