Tiger Nageshwara Rao: రవితేజను 'మాస్ మహారాజ్' అని ఫస్టు పిలిచిందెవరో తెలుసా?: హరీశ్ శంకర్

  • గ్రాండ్ గా జరిగిన 'టైగర్ నాగేశ్వరరావు' ఈవెంట్
  • ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు హరీశ్ శంకర్ 
  • 'మాస్ మహారాజ్' ట్యాగ్ ఇచ్చింది తానేనని వెల్లడి 
  • తనకి లైఫ్ ఇచ్చింది రవితేజని అని వ్యాఖ్య

Tiger Nageshwara Rao Pre Release Event

రవితేజ పేరుకు ముందుగా 'మాస్ మహారాజ్' అనే ట్యాగును తగిలించకుండా ఆయన పేరును పలకడం చాలా కష్టమైన విషయమే. తెరపై 'మాస్ మహారాజ్' అని పడటమే ఆలస్యం, థియేటర్స్ లో వచ్చే రెస్పాన్స్ వేరుగా ఉంటుంది. 'మాస్ మహారాజ్'గా ఆయనను మొదటిసారిగా గుర్తించింది ఎవరూ? ఎవరికి ఆ ఐడియా వచ్చింది? అనేది నిన్న జరిగిన 'టైగర్ నాగేశ్వరరావు' ప్రీ రిలీజ్ ఈవెంటులో దర్శకుడు హరీశ్ శంకర్ ప్రస్తావించాడు. 

"నా ఫస్టు సినిమా ఫ్లాప్ అయినప్పుడు .. మరో సినిమా కోసం నేను నిర్మాతల చుట్టూ తిరగడం మొదలుపెట్టాను. అలా నల్లమలుపు బుజ్జిగారిని కలిసినప్పుడు, 'లక్ష్యం' ఆడియో ఫంక్షన్ పనులు చూసుకోమని నాకు అప్పగించారు. దాంతో నేను ఆ రోజు సాయంత్రం అక్కడికి చేరుకున్నాను. ఏయే హీరోలను స్టేజ్ పైకి పిలుస్తున్నారనే లిస్టు చూశాను. ఒక్కో హీరోను ఒక్కో ట్యాగ్ తో పిలవాలని అనుకోవడం జరిగింది. 

అలా రవితేజను స్టేజ్ పైకి పిలిచేటప్పుడు .. 'మాస్ మహారాజ్' రవితేజ అని పిలవండి అని నేను సుమగారితో చెప్పాను. అలా రవితేజను 'మాస్ మహారాజ్' అని పిలవడం మొదలైంది. ఇండస్ట్రీలో నాకంటూ ఒక పేరు .. గుర్తింపు .. జీవితం ఇచ్చిన రవితేజకి నేను ఒక చిన్న ట్యాగ్ ఇవ్వడం చాలా గర్వంగా ఫీలవుతున్నాను. నా జీవితంలో 'అమ్మా .. నాన్న .. రవితేజ' అంటూ ఆయన పట్ల తనకి గల అభిమానాన్ని చాటుకున్నాడు. 

More Telugu News