Raviteja: రేణు దేశాయ్ గారి పాత్ర ఈ సినిమాకి హైలైట్: 'టైగర్ నాగేశ్వరరావు' ఈవెంటులో రవితేజ

  • వంశీ దర్శకత్వంలో రూపొందిన 'టైగర్ నాగేశ్వరరావు'
  • రియల్ స్టోరీలోని పాత్రలతోనే కథ నడుస్తుందన్న రవితేజ
  • రేణు దేశాయ్ పోషించిన పాత్ర గురించి ప్రస్తావన 
  • కొత్త హీరోయిన్స్ బాగా చేశారంటూ కితాబు 
  • డైలాగ్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారని వెల్లడి 

Tiger Nageshwara Rao Pre Release Event

తెలుగు తెరపైకి మరో బయోపిక్ గా 'టైగర్ నాగ్వేశ్వరరావు' రూపొందింది. రవితేజ టైటిల్ రోల్ ను పోషించిన ఈ సినిమాతో, నుపుర్ సనన్ కథానాయికగా పరిచయమవుతోంది. చాలా కాలం తరువాత రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇవ్వడం ఈ సినిమా ప్రత్యేకతలలో ఒకటిగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాద్ 'శిల్పకళావేదిక'లో గ్రాండ్ గా నిర్వహించారు.  

ఈ వేదికపై రవితేజ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో ప్రతి సీన్ చాలా గొప్పగా అనిపిస్తుంది .. అందుకు కారణం 'మధి' ఫొటోగ్రఫీ. రామ్ - లక్ష్మణ్ వాళ్లు 'చీరాల'కి చెందినవారే. 'టైగర్ నాగేశ్వరరావు' గురించి వాళ్లకి బాగా తెలుసు. అందువలన ఫైట్స్ గొప్పగా కంపోజ్ చేశారు. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ట్రైన్ ఎపిసోడ్ చాలా బాగా వచ్చింది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళుతుంది. డైలాగ్స్ ను విపరీతంగా ఎంజాయ్ చేస్తారు" అని చెప్పాడు. 

" రేణు దేశాయ్ గారు చాలా కాలం తరువాత కమ్ బ్యాక్ ఇచ్చారు. ఒరిజినల్ కేరక్టర్ కి చాలా దగ్గరగా ఆమె కనిపిస్తారు. ఆ పాత్రకి ఆమె చాలా కరెక్టుగా సరిపోయారు. ఆమె పాత్ర సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఇక నుపుర్ .. గాయత్రి .. అనుకృతి పాత్రలు కూడా ఒరిజినల్ లో ఉన్నవే. అందరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్లకి ఇది ఫస్టు ఫిల్మ్ అయినప్పటికీ అలా అనిపించరు.  డైరెక్టర్ వంశీ గురించి మాత్రం రిలీజ్ తరువాత మాట్లాడతాను" అంటూ ముగించాడు.

More Telugu News