Rahul Gandhi: తెలంగాణలో మూడ్రోజుల పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక పర్యటన

Rahul Gandhi and Priyanka will tour for three days in Telangana
  • తెలంగాణలో ఎన్నికల కోలాహలం
  • నవంబరు 30న పోలింగ్
  • ప్రచార సన్నాహాల్లో ప్రధాన పార్టీలు
  • ఈ నెల 18 నుంచి 20 వరకు రాహుల్, ప్రియాంక పర్యటన
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు నవంబరు 30న పోలింగ్ జరగనుండగా, ప్రధాన పార్టీలన్నీ ప్రచారాస్త్రాలను రంగంలోకి దించుతున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులకు దన్నుగా ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తెలంగాణకు వస్తున్నారు. రాష్ట్రంలో వారిరువురు మూడ్రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో రాహుల్, ప్రియాంకల పర్యటన ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. 

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావ్ ఠాక్రే స్పందిస్తూ, అక్టోబరు 18న ములుగు నుంచి కాంగ్రెస్ బస్సు యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. మహిళా డిక్లరేషన్ లో భాగంగా రాహుల్ గాంధీ, ప్రియాంక ప్రసంగిస్తారని వివరించారు. కరీంనగర్, పెద్దపల్లిలో పాదయాత్ర, బహిరంగ సభల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. జగిత్యాల, ఆర్మూర్ లో రైతులతో రాహుల్ సమావేశం కానున్నారని... నిజామాబాద్ లో పాదయాత్ర, బహిరంగ సభ ఉంటాయని ఠాక్రే వెల్లడించారు.
Rahul Gandhi
Priyanka Gandhi
Telangana
Congress
Assembly Elections

More Telugu News