YV Subba Reddy: చంద్రబాబు ఆరోగ్యంపై దుష్ప్రచారాన్ని నమ్మవద్దు: వైవీ సుబ్బారెడ్డి

  • చంద్రబాబు అరెస్టును టీడీపీ సాకుగా చూపే ప్రయత్నం చేసి, విఫలమైందన్న వైవీ సుబ్బారెడ్డి
  • ఇప్పుడు అనారోగ్యాన్ని సింపతీ కోసం వాడుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపణ
  • ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన వైవీ సుబ్బారెడ్డి
YV SUbbareddy on chandrababu Naidu health condition

చంద్రబాబు ఆరోగ్యంపై టీడీపీ శ్రేణులు, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంపై వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడుతూ... ఇదివరకు చంద్రబాబు అరెస్ట్‌ను తెలుగుదేశం పార్టీ సాకుగా చూపి సానుభూతి పొందే ప్రయత్నం చేసిందని, కానీ అప్పుడు ఆ పార్టీ విఫలమైందన్నారు. ఇప్పుడు చంద్రబాబు అనారోగ్యాన్ని కూడా సింపతీ కోసం వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

More Telugu News