Kottu Satyanarayana: చంద్రబాబుకు ఏదైనా జరిగితే భువనేశ్వరి, లోకేశ్ లదే బాధ్యత: కొట్టు

If something happens to Chandrababu his  family is responsible says Kottu Satyanarayana
  • చంద్రబాబుకు కుటుంబ సభ్యుల నుంచే హాని ఉండొచ్చన్న కొట్టు
  • కుటుంబ సభ్యులపై చంద్రబాబుకు భయాలు కూడా ఉన్నాయని వ్యాఖ్య
  • తండ్రి చావుకు చంద్రబాబు కారణమైనా భువనేశ్వరి స్పందించలేదని విమర్శ
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే హాని ఉండొచ్చని ఏపీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే దానికి బాధ్యత భువనేశ్వరి, లోకేశ్ లదేనని చెప్పారు. తన కుటుంబ సభ్యులే తనపై కుట్రలు చేసి అంతం చేస్తారనే భయాలు చంద్రబాబుకు కూడా ఉన్నాయని వ్యాఖ్యానించారు. 

తన కన్నతండ్రి ఎన్టీఆర్ కు తన భర్త చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని... ఆయన చావుకు భర్త కారణమైనప్పటికీ భువనేశ్వరి స్పందించలేదని విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలంలో జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
Kottu Satyanarayana
YSRCP
Chandrababu
Nara Bhuvaneswari
Nara Lokesh
Telugudesam

More Telugu News