ఆదివారం రాత్రి చేతులను తాడు లేదా రిబ్బను, గుడ్డతోనైనా కట్టేసుకుని నిరసన తెలపండి: లోకేశ్

Nara Lokesh calls for latest protest
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • న్యాయానికి సంకెళ్లు పేరిట కార్యాచరణకు పిలుపునిచ్చిన లోకేశ్
  • ఇప్పటికే మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి కార్యక్రమాలు చేపట్టిన టీడీపీ
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో, ఇటీవల టీడీపీ హైకమాండ్ వినూత్న నిరసనలకు పిలుపుచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి కార్యక్రమాలు చేపట్టాయి. 

ప్లేట్లు కొట్టడం, విజిల్స్ ఊదడం, హారన్లు మోగించడం... ఇళ్లలో లైట్లు ఆపేసి బయటికొచ్చి దీపాలు, కొవ్వొత్తులు వెలిగించడం వంటి చర్యల ద్వారా చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఈ కోవలోనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 'న్యాయానికి సంకెళ్లు' పేరిట మరో నిరసన కార్యాచరణకు పిలుపునిచ్చారు. 

"చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించి న్యాయానికి సంకెళ్లు వేసిన పిచ్చి జగన్ నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా ఆదివారం (అక్టోబరు 15) రాత్రి 7 గంటల నుంచి 7.05 గంటల వరకు చేతులను తాడు లేదా రిబ్బను, గుడ్డతోనైనా కట్టుకుని నిరసన తెలియజేయండి... తద్వారా చేతులకు సంకెళ్లు వేసుకున్నట్టుగా. న్యాయానికి ఇంకెన్నాళ్లీ సంకెళ్లని నినదించండి. ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసి చంద్రబాబు ధర్మపోరాటానికి మద్దతు ఇవ్వండి" అని లోకేశ్ సూచించారు.
Go Back to Shorts
Nara Lokesh
Protest
Chandrababu
Arrest
TDP
Andhra Pradesh

More Telugu News