ప్రధాని మోదీకి రాఖీ కట్టిన మెక్సికో మహిళా రాజకీయవేత్త
- ఢిల్లీలో పీ20 సదస్సు
- పలు దేశాల పార్లమెంటు స్పీకర్లతో సమావేశం
- హాజరైన మెక్సికో సెనేట్ అధ్యక్షురాలు అనా లిలియా రివేరా
- మోదీలో సోదరుడ్ని చూసుకున్న విదేశీ నేత
ఈ సందర్భంగా పీ20 సదస్సు వేదిక వద్ద ఆసక్తికర సన్నివేశం ఆవిష్కృతమైంది. ప్రధాని నరేంద్ర మోదీకి మెక్సికో సెనేట్ అధ్యక్షురాలు అనా లిలియా రివేరా రాఖీ కట్టారు. మోదీని ఓ సోదరుడిగా భావిస్తున్నట్టు తెలిపారు. ఓ విదేశీ రాజకీయవేత్త తనకు రాఖీ కట్టడం పట్ల మోదీ హర్షం వెలిబుచ్చారు. అనా లిలియా తలపై చేయి వేసి దీవించారు. భారత్-మెక్సికో సంబంధాలు మరింత సుహృద్భావ ధోరణిలో ముందుకెళ్లాలని అభిలషిస్తున్నట్టు తెలిపారు.