దర్శకుడు దేవ కట్టా కామెంట్స్‌ను రీట్వీట్ చేసిన నారా లోకేశ్
- ఏపీలో పాలనపై పరోక్షంగా విమర్శలు గుప్పించిన లోకేశ్
- ప్రజాస్వామ్యంలో నేరం రుజువయ్యే వరకు మీరు దోషి కాదు...
- నియంతృత్వంలో నిర్దోషి అని నిరూపించబడే వరకు మీరు దోషులే అనే వ్యాఖ్యలను రీట్వీట్ చేసిన లోకేశ్
'ప్రజాస్వామ్యం: నేరం రుజువయ్యే వరకు మీరు దోషి కాదు!!
నియంతృత్వం: నిర్దోషి అని నిరూపించబడే వరకు మీరు దోషులే!!'
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ గత నెల 9న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నెల రోజులకు పైగా ఆయన రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉంటున్నారు.