టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్లో గాయపడ్డ రవితేజ.. మోకాలికి 12 కుట్లు!
- ట్రైన్ దోపిడీ సీన్లో అదుపుతప్పి కిందపడిన రవితేజ
- రెండు రోజులకే మళ్లీ షూటింగ్‌కు రెడీ
- విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా వినలేదన్న నిర్మాత
- తాజాగా వెల్లడించిన అభిషేక్ అగర్వాల్
ఆ షాట్లో దాదాపు 400 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారని, కాబట్టి షూటింగ్‌ను ఎక్కువ రోజులు వాయిదా వేస్తే నిర్మాత నష్టపోతాడని భావించిన రవితేజ రెండు రోజుల్లోనే మళ్లీ షూటింగ్‌కు రెడీ అయిపోయారట. విశ్రాంతి తీసుకోవాలని చెప్పినా వినలేదని, సినిమాపై ఆయనకు ఉన్న అంకితభావానికి అది నిదర్శనమని చెప్పుకొచ్చారు. విషయం తెలిసిన అభిమానులు రవితేజను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ కథానాయికలుగా నటిస్తున్నారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీశర్మ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.