Man Beats Son: కోచింగ్‌కు వెళ్తున్నట్టు చెప్పి ఇలా చేస్తే ఏ తండ్రికైనా కోపం రాదా చెప్పండి.. వీపు విమానం మోత మోగించేశాడు.. వీడియో ఇదిగో!

Man Beats Son After Catching Him Hanging Out At Cafe Instead of Coaching Classes Here Is the Video
  • హుక్కా కేఫ్‌లో దొరికిన కుమారుడు
  • అందరి ముందు  అరుస్తూ చావబాదిన తండ్రి
  • హుక్కా తాగుతున్న మరో కుర్రాడు, గ్రూప్ లీడర్‌పైనా ప్రతాపం
  • చేష్టలుడిగి చూస్తుండిపోయిన మిగతా వారు
క్లాసులకు వెళ్తున్నానని చెప్పి బంక్ కొట్టి ఫ్రెండ్స్‌తో కలిసి షికార్లకెళ్తూ.. హుక్కా కేఫ్‌ల చుట్టూ తిరిగితే ఏ తండ్రికైనా కోపం రాదా చెప్పండి. వచ్చింది.. చిర్రెత్తుకొచ్చే కోపం వచ్చింది. అంతే.. అందరిముందు పట్టుకుని వీపు విమానం మోతమోగిస్తూ భూమ్యాకాశాలు బద్దలయ్యేలా అరుస్తూ కుమారుడి తాటతీశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హుక్కా కేఫ్‌లో కూర్చుని స్నేహితులతో ముచ్చట్లాడుతూ హుక్కా పీలుస్తున్న కుమారుడి దగ్గరికి నేరుగా వెళ్లిన తండ్రి.. పెద్దగా అరుస్తూ.. ‘క్యా బోలా థా’ (నాకేం చెప్పావ్?) అని అరుస్తూ కుర్చీ నుంచి లేపి తీసుకొచ్చి వాయించిపడేశాడు. అంతేకాదు, ఆ గ్రూపు నాయకుడి గురించి ఆరా తీస్తూ అతడిని కూడా చావబాదాడు. ఆయనతో వచ్చిన బురఖాలో ఉన్న మహిళ (బహుశా పెద్దాయన భార్య అయి ఉండొచ్చు) హుక్కా పీల్చుతున్న మరో కుర్రాడిని పట్టుకుని నిందించడం ప్రారంభించింది. ఆ వెంటనే ఆ పెద్దాయన ఆ కుర్రాడిని కూడా లేపి కాలితో తన్నుతూ, కొడుతూ తరుముకెళ్లాడు. అయితే, ఇది ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం తెలియరాలేదు. 

  వైరల్ అయిన వీడియోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు అతడి చర్యను సమర్థిస్తుంటే.. మరికొందరు మాత్రం అతడు తప్పు చేశాడని, కొడుకు చేజారకముందే అతడా పని చేయాల్సి ఉందని పెద్దాయనను నిందిస్తున్నారు. ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కవ స్వేచ్ఛ ఇస్తున్నారని, ఈ విషయంలో కొంత కఠినంగా ఉండడం తప్పనిసరని మరో యూజర్ కామెంట్ చేశాడు.
Man Beats Son
Hookah Cafe
Viral Video

More Telugu News