Students: పాలస్తీనాకు మద్దతుగా హైదరాబాద్ లో విద్యార్థినుల ర్యాలీ

Students staging pro Palestine protest in Hyderabad detained
  • ట్యాంక్ బండ్ సమీపంలో నిరసన కార్యక్రమం
  • పాలస్తీనా వర్ధిల్లాలి అంటూ ప్లకార్డులతో ప్రదర్శన
  • డౌన్ డౌన్ ఇజ్రాయెల్ అంటూ నినాదాలు
యుద్ధంతో దద్దరిల్లిపోతున్న పాలస్తీనాకు సంఘీభావంగా హైదరాబాద్ లో కొంత మంది విద్యార్థునులు శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాజాపై ఇజ్రాయెల్ బాంబు దాడులను ఖండిస్తూ నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ సమీపంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలస్తీనా దీర్ఘకాలం పాటు వర్ధిల్లాలి అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. 

ఈ సందర్భంగా నిరసనకారులు ‘డౌన్ డౌన్ ఇజ్రాయెల్’ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వ్యాన్లలో తరలించారు. నిరసన కార్యక్రమం నిర్వహణకు అనుమతి లేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గాజా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత హైదరాబాద్ లో జరిగిన తొలి నిరసన కార్యక్రమం ఇదే కావడం గమనార్హం. కాగా, పోలీసులు తమను నిర్బంధించడాన్ని హక్కుల కార్యకర్తలు ఖండించారు.
Students
protest
Hyderabad
Palestine support
police detained

More Telugu News