Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా రేపు హైదరాబాద్‌లో వినూత్న నిరసన.. 'లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్'

Chandrababu supporters to participate in lets metro for cbn peaceful protest
  • శనివారం 10.30-11.30 మధ్య నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణిస్తూ నిరసన తెలిపేందుకు నిర్ణయం
  • మియాపూర్-ఎల్‌బీనగర్ స్టేషన్ల మధ్య నిరసన కార్యక్రమం నిర్వహణ
  • తోటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా శాంతియుతంగా నిరసన 
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా టీడీపీ అభిమానులు, కార్యకర్తలు ‘లెట్స్ మెట్రో ఫర్ సీబీఎన్’ పేరిట మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం 10.30 నుంచి 11.30 మధ్య మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ స్టేషన్ వరకూ నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించనున్నారు. మెట్రో ప్రయాణికులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఈ శాంతియుత నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. 

మియాపూర్-ఎల్‌బీ నగర్ మధ్య వీలైనన్ని స్టేషన్లలో నల్ల టీషర్టులు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని నిర్వాహకులు టీడీపీ మద్దతుదారులకు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో మెట్రో ఏర్పాటు కావడానికి కారణమైన టీడీపీ అధినేతకు మద్దతుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 
Chandrababu
Telugudesam
YS Jagan

More Telugu News