భారత్-పాక్ మ్యాచ్ కోసం వందల సంఖ్యలో నకిలీ టిక్కెట్ల విక్రయం... లక్షల దోపిడీ
- అక్టోబర్ 14న భారత్-పాక్ మ్యాచ్‌కు యమ క్రేజ్
- ఒరిజినల్ టిక్కెట్ కొనుగోలు చేసి నకిలీవి ముద్రించిన నిందితులు
- వందల సంఖ్యలో టిక్కెట్లు అమ్మి లక్షలు దోచుకున్న వైనం
- నకిలీ టిక్కెట్ల విక్రయం కేసులో నలుగురి అరెస్ట్
గాంధీనగర్, అహ్మదాబాద్‌లలోని నలుగురు వ్యక్తులు నకిలీ టిక్కెట్ల మోసానికి పాల్పడ్డారు. మొదట ఈ నలుగురు ఒరిజినల్ టిక్కెట్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత అచ్చం అలాగే పదుల సంఖ్యలో నకిలీ టిక్కెట్లను ముద్రించారు. తొలుత 50 టిక్కెట్లను ముద్రించి సొమ్ము చేసుకున్నారు. ఆ తర్వాత మరో 200 టిక్కెట్లను ముద్రించారు. ఒక్కో టిక్కెట్‌ను రూ.2వేల నుంచి రూ.20వేలకు విక్రయించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు జైమీన్, ధ్రుమిల్, రాజ్ వీర్, ఖుష్ లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.