Indian Railways: ఈ వెబ్‌సైట్ల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయవద్దు: ఐఆర్‌సీటీసీ అలర్ట్

  • ఫుడ్ డెలివరీ యాప్స్ పట్ల అప్రమత్తం చేసిన ఇండియన్ రైల్వేస్
  • అనధికారికంగా ఫుడ్ డెలివరీ చేస్తోన్న వెబ్ సైట్ల జాబితాను పంచుకున్న రైల్వేస్
  • ఈ-కేటరింగ్ వెబ్ సైట్ ద్వారా మాత్రమే ఆర్డర్ చేయాలని సూచన
Lists of websites of unauthorised train food delivery vendors


ప్రయాణికులను ఐఆర్‌సీటీసీ అలర్ట్ చేసింది. అనధికారిక ఫుడ్ డెలివరీ యాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదే సమయంలో ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వేస్ తీసుకు వచ్చిన ప్లాట్ ఫామ్స్ గురించి తెలిపింది. అనధికారికంగా ఫుడ్ డెలివరీ చేస్తోన్న వెబ్ సైట్ల జాబితాను తన ఈ-కేటరింగ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకుంది.

రైల్ రెస్ట్రో, రైలు మిత్ర, ట్రావెల్ ఖానా, రైల్ మీల్, దిబ్రెయిల్, ఖానా ఆన్ లైన, ట్రైన్స్ కేఫ్, ఫుడ్ ఆన్ ట్రాక్, ఈ-కేటరింగ్, ట్రైన్ మెనూ వంటి వెబ్ సైట్ల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయవద్దని సూచించింది.

ఆహారాన్ని ఐఆర్సీటీసీ ఈ-కేటరింగ్ వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ చేయాలని సూచించింది. ఈ వెబ్ సైట్లోకి వెళ్లి రైలు వివరాలు లేదా స్టేషన్ వివరాలు ఎంటర్ చేయాలని, ఆ తర్వాత పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసి మీకు నచ్చిన ఫుడ్‌ను ఎంచుకోవాలని సూచించింది. పే ఆన్ లైన్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ... ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయని తెలిపింది. అలాగే 1323 నెంబర్‌కు కాల్ చేసి లేదా 91-8750001323 వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేయవచ్చునని చెప్పారు.

More Telugu News