Vijay: 'లియో' నుంచి 'ప్రేమ ఓ ఆయుధం' సాంగ్ రిలీజ్!

Leo movie yrical song released
షార్ట్స్‌లో చూడండి
విజయ్ హీరోగా లోకేశ్ కనగరాజ్ రూపొందించిన 'లియో' సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. సెవెన్ స్క్రీన్ స్టుడియోస్ బ్యానర్ పై లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 19వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం 'ప్రేమ ఓ ఆయుధం' అనే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'రాసిచ్చాలే మనసే .. చేసేస్తాలే తపస్సే' అంటూ ఈ పాట మొదలవుతోంది. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా, జేవీ సుధాన్షు - ప్రియమాలి ఆలపించారు. 

ఈ పాటను హీరో - హీరోయిన్ .. వాళ్ల పాపపై చిత్రీకరించారు. ముగ్గురూ కూడా సరదాగా .. సంతోషంగా గడుపుతూ ఉండగా, ఈ పాట ప్లే అవుతూ ఉంటుంది. మంచుకొండల్లో ఈ పాట చిత్రీకరణ సాగింది. ఇతర ముఖ్యమైన పాత్రలలో సంజయ్ దత్ .. అర్జున్ .. గౌతమ్ మీనన్ .. ప్రియా ఆనంద్ కనిపించనున్నారు.

Go Back to Shorts
Vijay
Trisha
Sanjay Dutt
Arjun
Leo Movie

More Telugu News