పురందేశ్వరికి పొద్దున లేస్తే అదే అజెండా.. చంద్రబాబు లక్కీ అనుకోవాలి: సజ్జల సెటైర్లు
- చంద్రబాబును విడుదల చేయించే ప్రయత్నాల్లో పురంధేశ్వరి ఉన్నారన్న సజ్జల
- కుటుంబపరంగా అలా చేస్తే తప్పులేదు కానీ టీడీపీ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారన్న సజ్జల
- ఎన్టీఆర్ను గద్దె దించినప్పటి నుంచి చంద్రబాబు వెంటే ఎన్టీఆర్ కుటుంబం అని వ్యాఖ్య
కుటుంబపరంగా ప్రయత్నం చేస్తే తప్పులేదని, కానీ అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడూ ఇలాగే చేశారన్నారు. ఎన్టీఆర్ను గద్దె దించినప్పటి నుంచి నందమూరి కుటుంబం టీడీపీ అధినేత వెంటే ఉంటోందన్నారు. నిజంగా చంద్రబాబు లక్కీ అనుకోవాలా? లేక ఆయన కళనో తెలియదు కానీ ఎన్టీఆర్ కుటుంబం అంతా చంద్రబాబు కోసం ఏం చేసేందుకైనా సిద్ధంగా ఉంటారన్నారు. పైకి ఏదో ప్రభుత్వంపై పోరాటం అన్నట్లుగా వారి వ్యవహార శైలి ఉంటుంది కానీ, ఆయనను ఎలా విడుదల చేయాలా? అనే ఆలోచిస్తున్నారన్నారు.