తెలుగు ఆడియన్స్ ముందుకు నయనతార 'గాడ్' .. భయపెట్టే సైకలాజికల్ థ్రిల్లర్!
- తమిళంలో క్రితం నెలలో విడుదలైన 'ఇరైవన్'
- తెలుగులో 'గాడ్' టైటిల్ తో ఈ నెల 13న రిలీజ్
- సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో నడిచే కథ
- పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్న జయం రవి
తమిళంలో సెప్టెంబర్ 28వ తేదీన విడుదలైన ఈ సినిమా, నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. జయంరవి - నయనతార జంటగా నటించిన ఈ సినిమా, ఇక్కడ ఈ నెల 13వ తేదీన థియేటర్లకు రానుంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ .. ఇది ఏ స్థాయిలో భయపెట్టనుందో చెప్పేసింది.
అర్జున్ (జయం రవి) ఓ పోలీస్ ఆఫీసర్. అతను కొంతమంది క్రిమినల్స్ ను జైలు నుంచి రిలీజ్ చేస్తాడు. వాళ్లలో టీనేజ్ అమ్మాయిలను వరుసగా చంపుకుంటూ వెళ్లే సీరియల్ కిల్లర్ కూడా ఉంటాడు. అతనికీ .. అర్జున్ కి మధ్య ఈ కథ నడుస్తుంది. ఈ తరహా జోనర్లో నయన్ నుంచి కొంత గ్యాప్ తరువాత వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తుందనేది చూడాలి.