Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆమిర్ ఖాన్ ఇంట పెళ్లి బాజాలు

Aamir Khan shares daughter Iras wedding date says Nupur is like a son
Advertisement
  • జనవరి 3న కుమార్తె ఇరాఖాన్ వివాహం
  • తేదీని ప్రకటించిన అమీర్ ఖాన్
  • నుపుర్ తనకు కుమారుడితో సమానమని ప్రకటన
Advertisement
ఆమిర్ ఖాన్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆమిర్ ఖాన్, ఆయన మాజీ భార్య రీనా దత్తా తనయ ఇరా ఖాన్ నిశ్చితార్థం 2022 నవంబర్ 18 న జరగడం తెలిసిందే. ఎంతో కాలం నుంచి ఆమె ప్రేమిస్తున్న నుపుర్ శిఖర్ కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. నాటి నిశ్చితార్థానికి ఆమిర్ తన భార్య కిరణ్ రావు సైతం హాజరయ్యారు. ఇరా ఖాన్, నుపుర్ వివాహం తేదీపై ఇప్పటికే ఎన్నో చర్చలు నడుస్తుండగా, ఆమిర్ ఖాన్ స్వయంగా తేదీని ప్రకటించేశారు. 

2024 జనవరి 3న కుమార్తె వివాహం జరగనున్నట్టు ఆయన ప్రకటించారు. న్యూస్18కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆమిర్ దీనిపై స్పందించారు. ‘‘ఇరా జనవరి 3న వివాహం చేసుకోబోతోంది. అతడి పేరు నుపుర్. అతడో లవ్ లీ బోయ్. ఇరా మానసికంగా కుంగుబాటు చెందుతున్న సమయంలో ఆమెకు అండగా నిలిచాడు. ఆమెకు తోడుగా, మద్దతుగా నిలిచిన వ్యక్తి. వారు కలసి ఎంతో సంతోషంగా ఉన్నందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. వారు ఒకరి కోసం ఒకరు శ్రద్ధ తీసుకోగలరు’’ అని ఆమిర్ ఖాన్ తెలిపారు. నుపుర్ తనకు కుమారుడితో సమానమని ఆమిర్ పేర్కొన్నారు. అతడ్ని తమ కుటుంబ సభ్యుడిగానే భావిస్తున్నట్టు చెప్పారు. నుపుర్ తల్లి ప్రీతమ్ జీ ఇప్పటికే తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని పేర్కొన్నారు.
Advertisement
Advertisement
Aamir Khan
daughter
IraKHAN
Wedding

More Telugu News