Ajay: 'ఆహా' తెరపైకి 'మిస్టేక్' .. సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ!

  • మూడు ప్రేమ జంటల కథ 
  • అడవి నేపథ్యంలో సాగే కథనం
  • దర్శకుడిగా భరత్ పరిచయం  
  • ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్  
Mistake movie OTT release date confirmed

ఈ శుక్రవారం ఓటీటీ సెంటర్స్ సందడి కాస్త గట్టిగానే కనిపించనుంది. ఈ నేపథ్యంలో 'ఆహా' ద్వారా ప్రేక్షకులను పలకరించడానికి 'మిస్టేక్' అనే సినిమా రెడీ అవుతోంది. ఈ ఏడాది ఆగస్టు 4వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. 

అలాంటి ఈ సినిమాను ఈ నెల 13వ తేదీ నుంచి 'ఆహా' స్ట్రీమింగ్ చేయనుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా రిలీజ్ చేసింది. అభినవ్ సర్దార్ నిర్మించిన ఈ సినిమాకి, భరత్ కొమ్మాలపాటి దర్శకత్వం వహించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ నడుస్తుంది. 

ముగ్గురు స్నేహితులు సిటీలో ఒక రూమ్ తీసుకుని ఉంటారు. ఈ ముగ్గురూ కూడా తమ లవర్స్ ను వెంటబెట్టుకుని ఒక ఫారెస్టుకు వెళతారు. అక్కడ వాళ్లు ఎలాంటి 'మిస్టేక్' చేస్తారు? ఫలితంగా ఎలాంటి ఆపదలో చిక్కుకుంటారు? అనే ఆసక్తికరమైన అంశాలతో కథ ముందుకు వెళుతుంది. మరి ఓటీటీ సెంటర్ నుంచి ఈ సినిమా ఏ స్థాయి రెస్పాన్స్ ను తెచ్చుకుంటుందో చూడాలి.

More Telugu News