Prema Vimanam: ‘ప్రేమ విమానం’ మంచి సినిమా చూశామనే ఫీలింగును కలిగిస్తుంది: అనసూయ భరద్వాజ్

  • విభిన్నమైన కథాంశంతో రూపొందిన 'ప్రేమ విమానం'
  • హీరో .. హీరోయిన్లుగా సంగీత్ శోభన్ - శాన్వి మేఘన 
  • కీలకమైన పాత్రను పోషించిన అనసూయ 
  • ఈ నెల 12వ తేదీ నుంచి జీ 5లో స్ట్రీమింగ్   
Prema Vimanam Streaming date confirmed

గూఢచారి, కేశవ, రావణాసుర వంటి సినిమాలతో పాటు డెవిల్, 'గూఢచారి 2' వంటి భారీ బడ్జెట్స్‌తో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5 తో సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ప్రేమ విమానం’. ఈ వెబ్ ఫిల్మ్‌ను అక్టోబర్ 13న జీ 5లో రిలీజ్ చేయటానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. అయితే ప్రేక్షకుల రిక్వెస్ట్ మేరకు ఈ చిత్రం, ఓ రోజు ముందుగానే అంటే అక్టోబర్ 12నే జీ 5లో స్ట్రీమింగ్ కానుంది.
 
సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా నటించారు. సంతోష్ కాటా దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రీమియర్ షోని మంగళవారం మీడియాకు ప్రదర్శించారు.అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది.
 
డైరెక్టర్ సంతోష్ కాటా మాట్లాడుతూ.. ‘నేను విమానం ఇంతవరకూ ఎక్కలేదు.. సినిమా చేశాకే విమానం ఎక్కాలని ఫిక్స్ అయ్యా.. సినిమా హిట్ అయితేనే బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలని అనుకున్నా. ఈ చిన్న పిల్లలు ఆ పాత్రలను అద్భుతంగా పోషించారు. నిర్మాత పిల్లలనే ఉద్దేశంతో సినిమాలోకి తీసుకోలేదు. ఆ పిల్లలు చాలా కష్టపడ్డారు. పిల్లల నటన చూసి అభిషేక్ నామా గారు చాలా సంతోషించారు. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన జీ5 టీం, అభిషేక్ నామా గారికి థాంక్స్" అన్నాడు. 

అనసూయ మాట్లాడుతూ.. ‘కొన్నిసార్లు దర్శకులు చెప్పిన కథకు, తీసిన దాంట్లో తేడా ఉంటుంది. కానీ సంతోష్ మాత్రం ఏం చెప్పాడో.. ఎలా చెప్పాడో అదే తీశాడు. మొదటి సినిమా దర్శకుడిలా కనిపించలేదు. సెట్‌లు ఎక్కువగా వేయలేదు .. అంతా నేచురల్‌గా షూట్ చేశారు. నేను ప్రతీ సారి కొత్తగా ఉండే కథలను ఎంచుకుంటూ వస్తాను. 'శాంత' పాత్ర నాకు ఇచ్చినందుకు సంతోష్‌కు థాంక్స్. మంచి సినిమా చూశామనే ఫీలింగ్ మాత్రం అందరికీ వస్తుంది. మా 'ప్రేమ విమానం'ను అక్టోబర్ 12న  జీ5లో అందరూ వీక్షించండి’ అని అన్నారు.

  • Loading...

More Telugu News