Tiger Shroff: భయపడితే ఎక్కువ కొట్టేస్తాం :'గణపథ్' తెలుగు ట్రైలర్ డైలాగ్!

  • టైగర్ ష్రాఫ్ హీరోగా రూపొందిన 'గణపథ్'
  • ఆయన జోడీకట్టిన కృతి సనన్
  • కీలకపాత్రలో అమితాబ్
  • యాక్షన్ - ఎమోషన్ ప్రధానంగా కనిపిస్తున్న కంటెంట్ 
  • ఈ నెల 20వ తేదీన ఐదు భాషల్లో విడుదల
Ganapath movie telugu trailer released

బాలీవుడ్ లో ఈ ఏడాదిలో ఇంతవరకూ వచ్చిన భారీ సినిమాల జాబితాలో 'గణపథ్' చేరనుందనే విషయం ఈ సినిమా ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్స్ తో పాటు, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా ఈ ట్రైలర్ ఆసక్తిని రేపుతోంది. 

టైగర్ ష్రాఫ్ - కృతి సనన్ జంటగా నటించిన ఈ సినిమాలో, అమితాబ్ కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు. పూజ ఫిల్మ్స్ - గుడ్ కో సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించాడు. ఒక మాస్ ఏరియాకి చెందిన యువకుడు ధనవంతుల ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టాడు? తనవారి కోసం ఆ ప్రపంచానికి ఎలా ఎదురుతిరిగాడు? అనేదే కథ. 

కుస్తీ పోటీలకు సంబంధించిన అంశం కూడా ఈ కథలో ప్రధానంగా కనిపిస్తోంది. అలాగే కృతి సనన్ మార్షల్ ఆర్ట్స్ తో శత్రువులపై విరుచుకుపడుతోంది. 'మేము భయపడితే ఎక్కువ కొట్టేస్తాం' అనే డైలాగ్ బాగా కనెక్ట్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు.


More Telugu News