Akepati Subhashini: రోజాకు మద్దతుగా మాట్లాడి రాధిక, ఖుష్బూ, రమ్యకృష్ణ, మీనా బఫూన్లు అవుతున్నారు: జనసేన కార్యదర్శి సుభాషిణి

Janasena state secretary Subhashini slams actresses who came into support AP minister Roja

  • రోజా-బండారు సత్యనారాయణ మధ్య వ్యాఖ్యల రగడ
  • రోజాకు మద్దతుగా స్పందించిన రాధిక, రమ్యకృష్ణ, ఖుష్బూ, మీనా
  • నటీమణులను నిలదీసిన జనసేన నేత ఆకేపాటి సుభాషిణి

బండారు సత్యనారాయణ వ్యవహారంలో మంత్రి రోజాకు మద్దతుగా సినీ తారలు రాధిక, రమ్యకృష్ణ, కుష్బూ, మీనా వ్యాఖ్యలు చేయడం పట్ల జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిణి స్పందించారు. చిరంజీవిని, రజనీకాంత్ ను రోజా ఇష్టానుసారం దూషిస్తుంటే రాధిక, ఖుష్బూ, మీనా, రమ్యకృష్ణ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. వాళ్లను తిట్టడం మీకు సమ్మతమేనా? అని ప్రశ్నించారు. ఏపీలో అత్యాచారాలు, మహిళల అదృశ్యంపై సదరు సినీ తారలు ఎందుకు స్పందించడంలేదని అన్నారు. రోజా ఎలాంటిదో తెలుసు కాబట్టే వైసీపీ మహిళలు ఎవరూ మాట్లాడలేదని సుభాషిణి పేర్కొన్నారు. 

ఇతర మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు... వీళ్ల జోలికి వెళ్లకుండా రోజానే ఎందుకు విమర్శిస్తున్నారు?... నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెతను రోజా గ్రహించాలి... రోజా ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలి అని హితవు పలికారు. 

"ఈ చెన్నై గ్యాంగ్ కు చెప్పేదొక్కటే... రాధిక, రమ్యకృష్ణ, ఖుష్బూ అంటే నటీమణులుగా మాకు ఎంతో గౌరవం. మీరెంతో కష్టపడి ఆ స్థాయికి వచ్చారు. రోజా గురించి మాట్లాడుతుంటే మీరు చెన్నై నుంచి వచ్చి మాట్లాడుతున్నారు. మీరు బఫూన్లు అవుతున్నారు. రాష్ట్రంలో అత్యాచారాల గురించి రోజాను ప్రశ్నిస్తే... ఒకటో రెండో రేపులకు అంత గొడవ చేస్తారా అని రోజా పేర్కొంది... మరి రోజా వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా?

రాధిక గారూ... గతంలో చిరంజీవి వల్ల ఎంతో మేలు జరిగిందని మీరు, శరత్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. అలాంటి చిరంజీవి గురించి, ఆయన తమ్ముళ్లు నాగబాబు గురించి, పవన్ కల్యాణ్ గురించి రోజా నీచంగా మాట్లాడుతోంది. ఈ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా? రోజా మీరు అనుకున్నంత మంచిదైతే కాదు. ఇక్కడ రోజా చేసే చేష్టలు మీకు తెలియవు. 

వాళ్ల పార్టీలో బోరుగడ్డ అనిల్ అని ఒకడున్నాడు. వాడు పవన్ కల్యాణ్ వాళ్లింట్లో పసిబిడ్డల గురించి కూడా మాట్లాడాడు. అలాంటి వాళ్లను రోజా సమర్థిస్తుంటే, ఇప్పుడదే రోజాను మీరు సమర్థిస్తారా రాధిక గారూ? 

మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా... తమిళనాడులో సమస్యలేవీ లేవా? ఏపీ సమస్యలు మీకు కావాలనుకుంటే వైసీపీ కండువా వేసుకుని రండి. తమిళనాడులో సమస్యలపై స్టాలిన్ గారిని ప్రశ్నించే దమ్ముందా మీకు? తమిళనాడులో ఏదైనా మాట్లాడితే మిమ్మల్ని అక్కడ్నించి తరిమేస్తారని భయమా? 

రోజా... సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి కూడా మాట్లాడేసింది... దీన్ని కూడా మీరు సమర్థిస్తారా? మీరంటే మాకు గౌరవం... మీరు రోజాలాగా కాదు.. రోజా చాలా దిగజారిపోయింది. బండారు సత్యనారాయణ అవే మాటలు రోజాను కాకుండా ఇంకెవరినైనా అనుంటే నేనే ఆయనను ప్రశ్నించి ఉండేదాన్ని. రోజాను మించి ఆయనేం మాట్లాడలేదు. రోజానే ఆయనను మించి మాట్లాడింది" అంటూ సుభాషిణి నిప్పులు చెరిగారు.

Akepati Subhashini
Roja
Radhika
Ramyakrishnan
Khushboo
Meena
Janasena
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News