Election Code: తెలంగాణలో ఎన్నికల కోడ్... ఓ కారులో రూ.5 లక్షల నగదు స్వాధీనం

Police seized Rs 5 lakhs from car after election code implemented in Telangana
  • తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల
  • తనిఖీలు మొదలుపెట్టిన పోలీసులు
  • ఖమ్మం జిల్లా వైరా వద్ద ఓ కారులో రూ.5 లక్షల నగదు పట్టివేత
  • కారులో పశ్చిమ గోదావరి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజేశ్వరి
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పోలీసులు తనిఖీలకు తెరలేపారు. ఖమ్మం జిల్లా వైరాలో పోలీసుల తనిఖీలో పశ్చిమ గోదావరి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజేశ్వరి నుంచి రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 

కారులో ఆ నగదు తరలిస్తుండగా, ఆ నగదుకు ఎలాంటి అనుమతి పత్రాలు లేవని పోలీసులు గుర్తించారు. ఏలూరు నుంచి వ్యవసాయ భూమికి చెందిన డబ్బులు హైదరాబాద్ తీసుకెళుతున్నానంటూ రాజేశ్వరి పోలీసులకు తెలిపారు. 

దీనిపై పోలీసులు స్పందిస్తూ... పశ్చిమ గోదావరి నుంచి వచ్చిన ఓ కారులో రూ.5 లక్షలు లభ్యమయ్యాయని తెలిపారు. ఆ మహిళ సరైన పత్రాలు చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. స్వాధీనం చేసుకున్న రూ.5 లక్షలను ఐటీ అధికారులకు అప్పగిస్తామని వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లాలంటే అనుమతులు తప్పనిసరి అని పోలీసులు స్పష్టం చేశారు.
Election Code
Cash
Car
Police
Khammam District
Telangana

More Telugu News