IIT Kanpur: ఐఐటీ కాన్పూరులో చితక్కొట్టేసుకున్న విద్యార్థులు.. కుర్చీలతో కుమ్ములాట.. ముష్టిఘాతాలతో వీరంగం.. వీడియో ఇదిగో!

  • రెండు కబడ్డీ జట్ల మధ్య గొడవ
  • తెలియని కారణం
  • రెండు జట్లపైనా అనర్హత వేటు
Fight in IIT Kanpur as kabaddi players smash chairs on each other

ఐఐటీ కాన్పూరు విద్యార్థులు చితక్కొట్టేసుకున్నారు. వార్షిక క్రీడా వారోత్సవంలో భాగంగా శనివారం జరిగిన కబడ్డీ పోటీలో ఈ ఘటన జరిగింది. కారణం తెలియదు కానీ.. ప్లేయర్లు ఒకరిపై ఒకరు పడి కుమ్మేసుకున్నారు. కుర్చీలతో చావబాదుకున్నారు. ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వైఎంసీఏ-ఎన్ఎస్‌యూటీ జట్ల మధ్య ఈ ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది.

ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకుంటూ, ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకుంటూ బీభత్సం సృష్టించడం వీడియోలో కనిపించింది. పోట్లాటకు దిగిన రెండు జట్లు కాన్పూరు వెలుపలివి కావడం గమనార్హం. ఈ గొడవ తర్వాత రెండు జట్లపై అనర్హత వేటు వేశారు. ఈ ఘటనపై ఐఐటీ కాన్పూరు అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. 

More Telugu News