Muthireddy Yadagiri Reddy: టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ముత్తిరెడ్డి

Muthireddy takes charge as TSRTC Chairman
  • టీఎస్ఆర్టీసీకి కొత్త చైర్మన్
  • ఇప్పటివరకు ఆర్టీసీ చైర్మన్ గా వ్యవహరించిన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి
  • ఇవాళ బస్ భవన్ లో పదవీ స్వీకార కార్యక్రమం
  • రెండేళ్ల పాటు ఆర్టీసీ చైర్మన్ గా కొనసాగనున్న ముత్తిరెడ్డి
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) చైర్మన్ గా నేడు బాధ్యతలు చేపట్టారు. హైదరాబాదులోని బస్ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో లాంఛనంగా తన ఛాంబర్ లో ఆసీనులయ్యారు. టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా ముత్తిరెడ్డి రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా, ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో ముత్తిరెడ్డికి  స్థానం లభించకపోవడం తెలిసిందే. కాగా, ముత్తిరెడ్డికి ముందు టీఎస్ఆర్టీసీ చైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి వ్యవహరించారు. ఆయన పదవీకాలం ముగిసింది. ముత్తిరెడ్డి పదవీ స్వీకార కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Muthireddy Yadagiri Reddy
Chariman
TSRTC
BRS
Telangana

More Telugu News