Team India: వరల్డ్ కప్: తొలి మ్యాచ్ కు సిద్ధమైన టీమిండియా... టాస్ గెలిచిన ఆస్ట్రేలియా

Team India faces Australia in world cup league match
  • వరల్డ్ కప్ లో నేడు టీమిండియా × ఆస్ట్రేలియా
  • చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్
  • డెంగీతో మ్యాచ్ కు దూరమైన శుభ్ మాన్ గిల్
  • గిల్ స్థానంలో ఇన్నింగ్స్ ఆరంభించనున్న ఇషాన్ కిషన్
సొంతగడ్డపై జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమిండియా నేడు తన తొలి మ్యాచ్ ఆడనుంది. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాతో నేడు చెన్నైలో తలపడనుంది. ఈ మ్యాచ్ కు చెపాక్ స్టేడియం వేదికగా నిలవనుంది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. 

డెంగీ బారినపడిన టీమిండియా యువ ఓపెనర్ శుభ్ మాన్ గిల్ కు ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి కల్పించారు. గిల్ స్థానంలో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. హార్దిక్ పాండ్యా నెట్స్ లో గాయపడినట్టు వార్తలు వచ్చినా, ఇవాళ అతడు తుది జట్టులో ఉండడం శుభపరిణామం. 

బుమ్రా, సిరాజ్, పాండ్యా పేస్ బాధ్యతలు పంచుకుంటారు. జడేజా, అశ్విన్, కుల్దీప్ యాదవ్ లతో స్పిన్ విభాగం అత్యంత బలంగా, వైవిధ్యభరితంగా ఉంది. దాంతో, ఆసీస్ బ్యాటింగ్ లైనప్ కు, టీమిండియా బౌలర్లకు ఆసక్తికర పోరు జరగనుంది. 

టీమిండియా...
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా...
ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మ్యాక్స్ వెల్, అలెక్స్ కేరీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజెల్ వుడ్.
Team India
Australia
Toss
World Cup

More Telugu News