ra: రోజాపై బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలపై స్పందించిన రమ్యకృష్ణ

Ramyakrishna responds on bandaru comments on roja
  • మహిళలపై శారీరక, మానసిక హింసను అందరూ వ్యతిరేకించాలన్న రమ్యకృష్ణ
  • రోజాపై ఇష్టారీతిన మాట్లాడిన బండారుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • అంతకుముందే తీవ్రంగా స్పందించిన మహారాష్ట్ర మహిళా ఎంపీ నవనీత్ కౌర్
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా మీద టీడీపీ నేత బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై నటీమణులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ సభ్యురాలు, నటి నవనీత్ కౌర్, రాధిక, ఖుష్బూ సహా పలువురు... టీడీపీ నేత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి రమ్యకృష్ణ స్పందించారు.

మహిళలపై శారీరక, మానసిక హింసను అందరూ వ్యతిరేకించాలని ఆమె పిలుపునిచ్చారు. రోజాపై ఇష్టారీతిన మాట్లాడిన బండారుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, రోజా, రమ్యకృష్ణ సినిమాల్లో నటించినప్పటి నుంచి మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. ఇప్పటికీ వారి మధ్య మంచి స్నేహం కొనసాగుతోంది.
ra
ramyakrishna
Roja
Telugudesam

More Telugu News