Nara Lokesh: వెలుగుల చంద్రుడిని కుట్రల చీకట్లు ఏంచేయలేవని నినదించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు: నారా లోకేశ్

Lokesh thanked people who participated in Kanthi Tho Kranthi
  • స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
  • రాజమండ్రి జైలులో జ్యుడిషియల్ రిమాండ్
  • కాంతితో క్రాంతి కార్యక్రమానికి పిలుపునిచ్చిన టీడీపీ
  • ఢిల్లీలో కొవ్వొత్తి చేతబూని చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన లోకేశ్
స్కిల్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్  రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ 'కాంతితో క్రాంతి' కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఢిల్లీలో ఉన్న నారా లోకేశ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో నిర్వహించిన 'కాంతితో క్రాంతి' కార్యక్రమంలో పాల్గొని కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. దీనిపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. 

తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమాల కాంతికి కారకుడు చంద్రబాబునాయుడు అని స్పష్టం చేశారు. చేయని తప్పుకు, ఆధారాల్లేని కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారని లోకేశ్ ఆరోపించారు. 

ప్రగతి వెలుగులు పంచిన దార్శనిక నేత, ప్రజా సంక్షేమానికి పాటుపడిన అసలు సిసలు ప్రజాసేవకుడు చంద్రబాబుకు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారంతా మద్దతుగా నిలిచారని వెల్లడించారు. కాంతితో క్రాంతి కార్యక్రమంలో పాల్గొని వెలుగుల చంద్రుడిని కుట్రల చీకట్లు ఏమీ చేయలేవని నినదించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని లోకేశ్ పేర్కొన్నారు.
Nara Lokesh
Kanthi Tho Kranthi
Chandrababu
Arrest
TDP
Andhra Pradesh

More Telugu News