ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో ఉంది... చంద్రుడు రావాలి, వెలుగు తేవాలి: సినీ దర్శకుడు రాఘవేంద్రరావు
- స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్ట్
- సినీ రంగం నుంచి మొదటగా స్పందించిన దర్శకేంద్రుడు
- కాంతితో క్రాంతి కార్యాచరణకు పిలుపునిచ్చిన టీడీపీ
- లైట్లు ఆపేసి దీపం వెలిగించిన రాఘవేంద్రరావు
తాజాగా, టీడీపీ నాయకత్వం వచ్చిన పిలుపు మేరకు రాఘవేంద్రరావు 'కాంతితో క్రాంతి' కార్యాచరణలో పాల్గొన్నారు. ఇవాళ తన కార్యాలయంలో లైట్లు ఆపేసి దీపం వెలిగించారు. ఆ మేరకు ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం అంధకారంలో ఉంది... చంద్రుడు రావాలి, వెలుగు తేవాలి అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో రాఘవేంద్రరావు తాజా పోస్టుకు టీడీపీ మద్దతుదారుల నుంచి విశేష స్పందన వస్తోంది.