ICC World Cup: వరల్డ్ కప్ లో నేడు దక్షిణాఫ్రికా, శ్రీలంక ఢీ... బ్యాటింగ్ లో డికాక్, డుస్సెన్ ధనాధన్

  • ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
  • 27 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 168 పరుగులు చేసిన సఫారీలు
South Africa takes on Sri Lanka in world cup

భారత్ లో జరుగుతున్న ఐసీసీ వరల్డ్ కప్ లో నేడు దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ పోరులో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 

అయితే, దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్, వన్ డౌన్ బ్యాట్స్ మన్ వాన్ డెర్ డుస్సెన్ దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. 27 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా స్కోరు 1 వికెట్ నష్టానికి 168 పరుగులు. డికాక్ 71 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు... డుస్సెన్ 86 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్ తో 80 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

అంతకుముందు, కెప్టెన్ టెంబా బవుమా రెండో ఓవర్లోనే అవుటయ్యాడు. 8 పరుగులు చేసి బవుమా లంక మీడియం పేసర్ మధుషనక బౌలింగ్ లో వెనుదిరిగాడు.

More Telugu News