పూణె-ముంబై మార్గంలో రైలు పట్టాలపై బండరాళ్లు పెట్టిన దుండగులు.. తప్పిన పెను ప్రమాదం.. వీడియో ఇదిగో!

  Railway officials spot boulders at 5 different locations on Pune Mumbai upline
  • ఐదు చోట్ల బండరాళ్లు గుర్తించి తొలగించిన రైల్వే సిబ్బంది
  • నాలుగు రోజుల క్రితం ఉదయ్‌పూర్-జైపూర్ మార్గంలో వందేభారత్‌ రైలుకు తప్పిన ప్రమాదం
  • రైలు వస్తున్నప్పుడు రాళ్లు కిందపడిపోకుండా సపోర్టుగా మరికొన్ని రాళ్లు
  • సంఘవిద్రోహుల పనే అంటున్న అధికారులు
పూణె-ముంబై రైలు మార్గంలో పెను ప్రమాదం తప్పింది. ఈ మార్గంలో రైలు పట్టాలపై ఐదు వేర్వేరు చోట్ల దుండగులు బండరాళ్లు పెట్టారు. రైలు వస్తున్నప్పుడు అదురుకు అవి పడిపోకుండా వాటికి సపోర్టుగా మరికొన్ని రాళ్లు పేర్చారు. నిన్న మధ్యాహ్నం 3.40 గంటల సమయంలో పూణె-ముంబై అప్‌లైన్‌పై వీటిని గుర్తించిన రైల్వే అధికారులు తొలగించడంతో ప్రమాదం తప్పింది.
 
ఇది తప్పకుండా సంఘవిద్రోహ శక్తుల పనేనని సెంట్రల్ రైల్వే సీపీఆర్వో శివాజీ మనాస్‌పూర్ తెలిపారు. ఆ మార్గంలో అప్పటికే పనిచేస్తున్న పెట్రోలింగ్ బృందం బండరాళ్లను తొలగించినట్టు పేర్కొన్నారు. సమీప ప్రాంతాల్లోనూ తనిఖీ చేస్తున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.  

నాలుగు రోజుల క్రితం నార్త్ వెస్ట్రన్ రైల్వే  (ఎన్‌డబ్ల్యూఆర్) అధికారులు ఉదయ్‌పూర్-జైపూర్ ట్రాక్‌పైనా బండరాళ్లను గుర్తించారు. ఫిష్‌ప్లేట్లను కూడా దుండగులు ట్రాక్‌పై పెట్టారు. గమనించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సిబ్బంది బ్రేకులు వేసి ప్రమాదాన్ని నివారించారు.
Go Back to Shorts
Cental Railway
NWR
Boulders
Pune
Mumbai

More Telugu News