5 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం..ఆపై ఆత్మహత్య
- ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఘటన
- ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక అకస్మాత్తుగా అదృశ్యం
- బాలిక కోసం కుటుంబసభ్యులు వెతుకుతుండగా కంటపడ్డ దారుణం
- చిన్నారి కుటుంబసభ్యులను చూడగానే పారిపోయిన నిందితుడు
- చివరకు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య
బాలిక కుటుంబసభ్యులను చూడగానే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తమోడుతున్న బిడ్డను ఆసుపత్రికి తరలించాక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తుండగా మహమ్మద్ ఓ చెట్టుకు ఉరివేసుకుని కనిపించారు. పోలీసులకు భయపడో లేక పశ్చాత్తాపం వల్లనో అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.