Raviteja: రవితేజకు క్షమాపణ చెప్పిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్

Anupam Kher regrets not having worked with Ravi Teja
షార్ట్స్‌లో చూడండి
వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తోన్న 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొన్న అనుపమ్ దాదాపు నాలుగున్నర దశాబ్దాల కిందటి సంఘటనను గుర్తు చేసుకొని, రవితేజకు క్షమాపణ చెప్పారు.

1988లో రవితేజ తనతో ఫోటో దిగడానికి స్టూడియోకు వచ్చాడని, కానీ తాను షూటింగ్ బిజీ కారణంగా కుదరదని చెప్పానని, ఆ రోజు అలా అన్నందుకు ఇప్పుడు క్షమాపణ చెబుతున్నానని అనుపమ్ ఖేర్ అన్నారు. దీంతో పక్కనే ఉన్న రవితేజ, అది ఇప్పుడు ఎందుకు అన్నట్లుగా 'సర్ ప్లీజ్..' అన్నారు. అనుపమ్ ఖేర్ ఈ విషయం చెప్పిన తర్వాత అభిమానుల నుంచి రవితేజకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Go Back to Shorts
Raviteja
anupam kher
Bollywood
Tollywood

More Telugu News