రాజమండ్రి చేరుకున్న లోకేశ్ ను చూడగానే నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ముఖాల్లో కాంతులు... ఫొటోలు ఇవిగో!

  • ఢిల్లీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగొచ్చిన లోకేశ్
  • నేడు చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి పయనం
  • రాజమండ్రిలో భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలుసుకున్న లోకేశ్
  • చంద్రబాబు త్వరగా బయటికి వచ్చేస్తారని ప్రజలకు ధైర్యం చెప్పిన టీడీపీ యువనేత
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ పర్యటన ముగించుకుని గురువారం రాత్రి ఉండవల్లి చేరుకున్నారు. ఇవాళ ఆయన తన తండ్రి చంద్రబాబును కలుసుకునేందుకు రాజమండ్రి బయల్దేరారు. కొద్దిసేపటి కింద లోకేశ్ రాజమండ్రి చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత లోకేశ్ ను చూడగానే నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ముఖాల్లో వెలుగులు నిండాయి. ఈ సందర్భంగా అక్కడ భావోద్వేగాలతో కూడిన వాతావరణం నెలకొంది. 

అనంతరం, లోకేశ్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తండ్రి చంద్రబాబు గురించి వివరాలు తెలుసుకున్నారు. లోకేశ్ వస్తారని తెలియడంతో రాజమండ్రి క్యాంప్ సైట్ వద్దకు టీడీపీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చారు. వారందరినీ కలిసిన లోకేశ్ వారికి ధైర్యం చెప్పారు. చంద్రబాబు త్వరగా ప్రజల మధ్యకు వస్తారని తెలిపారు. 

కాగా, లోకేశ్ రాజమండ్రికి రోడ్డు మార్గంలో రాగా, దారిపొడవునా ఆయనకు ప్లకార్డులతో ప్రజలు మద్దతు తెలిపిన దృశ్యాలు కనిపించాయి.

Nara Lokesh
Nara Bhuvaneswari
Nara Brahmani
Rajahmundry
Chandrababu
TDP
Andhra Pradesh

More Telugu News