Pakistan: అహ్మదాబాద్‌లో భారత్-పాక్ మ్యాచ్‌ నేపథ్యంలో భారతీయ రైల్వే శుభవార్త!

  • అక్టోబర్ 5న నరేంద్రమోదీ స్టేడియంలో దాయాదుల పోరు
  • మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల నుంచి ప్రత్యేక వందే భారత్ రైలు
  • త్వరలో రైళ్ల షెడ్యూల్, టిక్కెట్ ధరల వివరాల వెల్లడి
Railways to operate special Vande Bharat trains for IND vs PAK match in Ahmedabad

క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అహ్మదాబాద్‌కు తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్ జరిగే రోజున మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రల నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక వందే భారత్ రైళ్లను నడపనున్నారు. ఈ మేరకు భారతీయ రైల్వే ప్రకటించింది.

ఆ రోజున వందే భారత్ రైలును నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే రైళ్ల షెడ్యూల్, టిక్కెట్ ధరల వివరాలను వెల్లడించనున్నామన్నారు. భారత్ - పాక్ మ్యాచ్ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో హోటళ్ల ధరలు భారీగా పెరగడం, విమాన టిక్కెట్ ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో వాటి నుంచి ఉపశమనం కలిగించేందుకు వందే భారత్ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

More Telugu News