Gutha Sukender Reddy: చంద్రబాబు అరెస్ట్ బాధాకరం: టీఎస్ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

Chandrababu arrest is not good says Gutha Sukender Reddy
  • చంద్రబాబు అరెస్ట్ ను ఖండించిన గుత్తా సుఖేందర్ రెడ్డి
  • జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న నేత చంద్రబాబు అని కితాబు
  • రాజకీయాల్లో ఇలాంటి అరెస్టులు సరికాదని వ్యాఖ్య
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ ను తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు ఖండిస్తున్నారు. తాజాగా తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా చంద్రబాబు అరెస్ట్ ను ఖండించారు. జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న చంద్రబాబును అరెస్ట్ చేయడం బాధాకరమని ఆయన అన్నారు. విచారణ పూర్తయ్యేంత వరకు ఎవరూ నేరస్తులు కాదని చెప్పారు. అవినీతి జరిగిందా? లేదా? అనేది కోర్టులు తేల్చాలని అన్నారు. రాజకీయాల్లో ఇలాంటి అరెస్టులు సరికాదని చెప్పారు.
Gutha Sukender Reddy
BRS
Chandrababu
Telugudesam
Arrest

More Telugu News