RBI: గృహరుణాలు తీసుకున్నవారు ఊపిరి పీల్చుకోవచ్చు.. ఆర్బీఐ రెపోరేటు యథాతథం!

  • 6.5 శాతంగా ఉన్న రెపోరేటును అలాగే కొనసాగించాలని నిర్ణయం
  • ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ ఎంపీసీ
  • రెపోరేటును యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా నాలుగోసారి
RBI tells good news to other banks keeps repo rate unchanged

గృహరుణాలు, ఈఎంఐలు కడుతున్న వారికి భారతీయ రిజర్వుబ్యాంకు (ఆర్బీఐ) శుభవార్త చెప్పింది. రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయించింది. ప్రస్తుతం 6.5 శాతం వద్దనున్న రెపోరేటును అలాగే కొనసాగించాలని ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్టు రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ తెలిపారు. ప్రపంచంలో కొత్త గ్రోత్ ఇంజిన్‌గా మారడానికి భారత్ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ఇతర బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసేదే రెపోరేటు. దీనిని యథాతథంగా కొనసాగించడం ఇది వరుసగా నాలుగోసారి. గతంలో ఏప్రిల్, జూన్, ఆగస్టులో జరిగిన మూడు ద్వైమాసిక సమావేశాల్లోనూ రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగించింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో మే 2022 నుంచి పాలసీ రేటును ఆర్బీఐ పెంచుతూ వస్తోంది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి అది 6.5 శాతానికి చేరుకుంది. అయితే, ఆ తర్వాత జరిగిన మూడు మూడు ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో మాత్రం రెపోరేటులో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు.

More Telugu News