Baber Azam: మా బిర్యానీ కంటే హైదరాబాద్ బిర్యానీ కాస్త స్పైసీగా ఉంది: పాక్ కెప్టెన్ బాబర్ అజామ్

Pakistan skipper Baber Azam opines on Hyderabad Dum Biryani
  • వరల్డ్ కప్ కోసం హైదరాబాద్ వచ్చిన పాక్ జట్టు
  • దమ్ బిర్యానీ రుచికి ఫిదా
  • హైదరాబాద్ బిర్యానీకి 8/10 మార్కులు ఇచ్చిన బాబర్

హైదరాబాద్ దమ్ బిర్యానీకి ఫిదా అవని వారు ఎవరుంటారు? వరల్డ్ కప్ కోసం హైదరాబాదులో అడుగుపెట్టిన పాక్ క్రికెట్ జట్టు కూడా వరల్డ్ ఫేమస్ హైదరాబాద్ దమ్ బిర్యానీ రుచి చూసింది. పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, ఆ జట్టులోని ఇతర ఆటగాళ్లు హైదరాబాద్ బిర్యానీపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. 

పాక్ లో పేరుగాంచిన కరాచీ బిర్యానీకి, హైదరాబాద్ బిర్యానీకి ఏంటి తేడా? అని మీడియా బాబర్ ను ప్రశ్నించింది. అందుకు బాబర్ స్పందిస్తూ, తమ బిర్యానీ కంటే హైదరాబాద్ బిర్యానీ కాస్త స్పైసీగా ఉందని వెల్లడించాడు. హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకత అదేనని తెలిపాడు. హైదరాబాద్ బిర్యానీకి తన ఫుడ్ చార్టులో 8/10 మార్కులు ఇస్తానని బాబర్ పేర్కొన్నాడు. 

మరికొందరు ఆటగాళ్లు ఫుల్ మార్కులు ఇచ్చారు. ఓపెనర్ ఇమాముల్ హక్ అయితే, కరాచీ బిర్యానీ బాగుంటుందా, హైదరాబాద్ బిర్యానీ బాగుంటుందా అనేది చెప్పడం కష్టమేని, రెండూ బాగుంటాయని వెల్లడించాడు.

  • Loading...

More Telugu News