Rahul Gandhi: ఇడుగో కొత్త రావణుడు... భారత్ ను ధ్వంసం చేయడమే ఇతని లక్ష్యం: రాహుల్ పై బీజేపీ పోస్టర్

  • రాహుల్ పై బీజేపీ తీవ్ర విమర్శలు
  • ఓ దుష్ట శక్తిగా పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్టు
  • ధర్మానికి వ్యతిరేకి... రాముడంటే ప్రబల విరోధం అని వివరణ
BJP terms Rahul Gandhi as new age Ravan

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శల దాడిని బీజేపీ తీవ్రతరం చేసింది. సోషల్ మీడియాలో ఏకంగా రాహుల్ పై ఓ పోస్టర్ విడుదల చేసింది. రావణ్... కాంగ్రెస్ పార్టీ ప్రొడక్షన్... దర్శకత్వం జార్జ్ సోరోస్ అని పేర్కొంది. రాహుల్ ను రావణుడిగా పేర్కొంటూ బీజేపీ ధ్వజమెత్తింది. ఇడుగో కొత్త తరం రావణుడు... ఇతడు దుష్ట శక్తి. ధర్మానికి వ్యతిరేకి. రాముడంటే ప్రబల విరోధం. ఇతడి లక్ష్యం భారత్ ను ధ్వంసం చేయడమే అంటూ బీజేపీ వివరించింది. భారత్ ప్రమాదంలో ఉంది అంటూ క్యాప్షన్ పెట్టింది.

More Telugu News